ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జూలై 30న విడుదల కావల్సిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడింది. జనవరి 8,2021న చిత్రాన్ని తప్పక విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. అయితే ఇటీవల ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా చిత్రం మరోసారి వాయిదా పడుతుందని పుకార్లు రాగా, అనుకున్న తేదీకే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పుకొచ్చారు
లాక్‌డౌన్ మరో రెండు వారాలు పెరగడంతో కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. బాహుబలి డేట్ కు ఆర్ఆర్ఆర్ చిత్రం రాబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ కు సినిమా విడుదల వాయిదా పడ్డట్లే అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి యూనిట్ సభ్యులు అనధికారికంగా స్పందించారు. షూటింగ్ కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. లాక్ డౌన్ కంటిన్యూగా మూడు నెలలు కొనసాగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. షూటింగ్ దాదాపు పూర్తైంది. నిర్మాణానంతర కార్యక్రమాలు ఒక వైపు కొనసాగుతున్నాయి. కాబట్టి జనవరిలో చిత్రం తప్పక విడుదల అవుతుందని అంటున్నారు.